
కర్నూల్ జిల్లాలో ఏపీ ఫైబర్ నెట్ కి చెందిన జిల్లా సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ఆర్. రామచంద్ర లంచం తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. బుధవారం సాయంత్రం బుద్వార్ పేటలోని శ్రీ చక్ర హాస్పిటల్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ ఆఫీస్ లో లంచం తీసుకుంటుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరానికి చెందిన సయ్యద్ ఖాదిర్ పాషా అనే వ్యక్తి ఆ సంస్థ(ఏపీ ఫైబర్ నెట్)తో ఒప్పందం కుదుర్చుకుని మరో ఐదు ఛానెళ్లను అదనంగా ప్రసారం చేయాలని కోరినందుకు రామచంద్ర లంచం డిమాండ్ చేశాడు. రూ.1,50,000 ఇస్తే అతను కోరిన పని చేస్తానని చెప్పడంతో ఖాదిర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ రోజు రాత్రి పక్కా ప్లాన్ తో ఖాదిర్ రామచంద్ర కు లంచం ఇచ్చాడు. అదే సమయంలో పోలీసులు అక్కడకు చేరుకొని రామచంద్రను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆ మొత్తం సొమ్మును రికవరీ చేశారు.