కృష్ణా పై ఏపీ కొత్తగా మరో 3 ప్రాజెక్టులు

ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు

 పల్నాడుకు నీళ్లిచ్చేందుకు 5వరికపూడిశెల లిఫ్ట్‌ స్కీం

 ఇప్పటికే వేదాద్రి లిఫ్ట్‌ పనులు ప్రారంభం

 పర్మిషన్‌లు లేకుండానే ప్రాజెక్టు పనులపై ఏపీ సర్కార్ దూకుడు

 కృష్ణా నీళ్లను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ తెలంగాణ ప్రాజెక్టులపై అడ్డగోలు కంప్లయింట్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా నది నుంచి వీలైనన్ని నీళ్లు వాడుకునేందుకు ఏపీ కొత్తగా మరో మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ చివరి ఆయకట్టుకు భరోసా ఇచ్చేందుకు వేదాద్రి లిఫ్ట్‌ ‌‌‌‌‌‌‌స్కీం పనులను మొదలుపెట్టింది. అంతకుముందే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, సంగమేశ్వరం లిఫ్టు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి దిగువన 10 టీఎంసీల కెపాసిటీతో రెం డు బ్యారేజీలు నిర ్మించడానికి సిద్ధమైంది. అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు వరికపూడిశెల లిఫ్ట్‌‌‌‌‌‌‌‌స్కీంను ప్రతిపాదించారు. ఈ మూడు కొత్త ప్రాజెక్టుల కోసం రూ. 4,243.26 కోట్లు ఖర్చు చేయనున్నట్టు జగన్ సర్కార్ ప్రకటించింది. కృష్ణా డెల్టాతో పాటు నాగార్జునసాగర్‌ ‌‌‌‌‌‌‌కుడి, ఎడమ కాలువల చివరి ఆయకట్టుకు అదనంగా నీళ్లు సమకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో ఏ ఒక్క దానికీ అనుమతులు లేవు. కానీ.. తెలంగాణ నిర్మి స్తున్నప్రాజెక్టులపై మాత్రం ఏపీ అడ్డగోలుగా కంప్లయింట్లుచేస్తోంది.

వరికపూడిశెల లిఫ్ట్ రెండు, మూడు దశలకు 1,273 కోట్లు

నాగార్జున సాగర్ కుడి కాలువలోని పల్నాడు ప్రాంతానికి నీటిని అందించే వరికపూడిశెల లిఫ్ట్‌ ‌‌‌‌‌‌‌స్కీంను త్వరలోనే మొదలు పెట్టడానికి ఏపీ రంగం సిద్ధం చేసింది. తొలి దశ పనులకు ఇంతకుముందే రూ. 340.26 కోట్లతో అనుమతినిచ్చింది. రెండు, మూడో దశల పనులకు రూ. 1,273 కోట్లతో తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 48,236 ఎకరాల ఆయకట్టుకు సాగునీ ళ్లు, మూడు మండలాలకు తాగునీళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు దశల్లో వరికపూడిశెల లిఫ్టు స్కీం పనులను చేపట్టనున్నారు. 2019 ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతానికి నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతామని జగన్‌ హామీ ఇచ్చారు.

ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు

కృష్ణాడెల్టాలో ప్రకాశం బ్యారేజీనే చిట్టచివరి ఆనకట్ట. ఈ బ్యారేజీ గేట్లుఎత్తితే కృష్ణా నీళ్లుబంగాళాఖాతం లో చేరుతాయి. ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ 3.05 టీఎంసీలు. దీనికి దిగువన ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు బ్యారేజీలను నిర్మించడానికి రెడీ అయింది. సముద్రం పోటుతో హంసల దీవితో పాటు ఎగువ ప్రాంతంలోని భూములు చౌడుబారుతున్నాయని, అందుకే ఈ బ్యారేజీలు నిర్మిస్తున్నామని ఏపీ సర్కారు చెప్తోంది. కానీ ఏడాది పొడవునా 10 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా డెల్టాఆయకట్టుకు భరోసా ఇవ్వాలనేదే ఏపీ ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లాలోని చోడవరం, గుంటూరు జిల్లా రామచం ద్రాపురం మధ్య 4.5 టీఎంసీల కేపాసిటీతో బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.1,215 కోట్లు కేటాయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 62 కి.మీ.ల దిగువన కృష్ణాజిల్లా బండికోళ్లంక గుంటూరు జిల్లా తూర్పుపాలెం మధ్య 5.5 టీఎంసీల కెపాసిటీతో మరో బ్యారేజీని నిర్మించనున్నారు. దీనికి రూ.1,350 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

డెల్టాకు కృష్ణా, గోదావరి నీళ్లు

కృష్ణా డెల్టా ఆయకట్టుకు కృష్ణా నదితోపాటు గోదావరి నీళ్లు తరలించి ఉపయోగించుకుంటున్నారు. కృష్ణాలో వరదలు ఆలస్యంగా వస్తుండటంతో పట్టిసీమ నుంచి ఏటా 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి ఆయకట్టుకు ఇస్తున్నారు. కేవలం డెల్టా ఆయకట్టు కోసమే నాగార్జున సాగర్‌కు దిగువన 45.77 టీఎంసీల కెపాసిటీతో పులిచింతల నిర్మించారు. ఇటు పులిచింతల, అటు పట్టిసీమ నీటితో సస్యశ్యామలం అవుతున్న డెల్టాకు అదనపు నీటిని ఇచ్చేందుకే ఏపీ కొత్త బ్యారేజీలను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి నీళ్లకు బదులుగా తెలంగాణ నాగార్జున సాగర్‌కు ఎగువన 45 టీఎంసీలు వాడుకోవాలని బచావత్‌ అవార్డులోనే చెప్పినా ఆ నీటిని కేటాయించకుండా ఏపీ ఎప్పటికప్పుడు అడ్డుతగులుతోంది.

వేదాద్రితో సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు సరిగా నీళ్లురావడం లేదని చెప్తూ ఏపీ ప్రభుత్వం వేదాద్రి లిఫ్ట్‌ స్కీం ను తలపెట్టింది. ఆగస్టు28న ఏపీ సీఎం జగన్‌ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టు ను ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టుకు 11 కి. మీ.ల దిగువన రోజుకు 386.27 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగర్‌ ఎడమ కాలువ కింద జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 38,627 ఎకరాలకు నీళ్లుఇస్తా మని ప్రకటించారు. మూడు దశల్లో నీటిని ఎత్తిపోసి నందిగామ బ్రాంచ్‌ కెనాల్‌తో పాటుచివరి ఆయకట్టు ప్రాంతానికి తరలిస్తారు.

తెలంగాణ ప్రాజెక్టులపై అడ్డగోలు కంప్లైంట్లు

నాగార్జు నసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన భక్త రామదాసు లిఫ్ట్‌ స్కీంతో పాటు దశాబ్దాల తరబడి నీళ్లు అందని ఆర్డీఎస్‌ ఆయకట్టు ను స్టెబిలైజ్‌ చేసేందుకు తలపెట్టిన తుమ్మిళ్ల లిఫ్ట్‌ స్కీంపై ఏపీ అడ్డగోలు కంప్లైంట్లు చేసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మొదలుకొని కేంద్ర ప్రభుత్వం దాకా ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. తెలంగాణ ప్రాజెక్టు లకు పర్మిషన్లు లేవని గగ్గోలు పెట్టిన ఏపీ.. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను నిర్మిస్తోంది.

 

 

Latest Updates