కూర‌గాయ‌ల ధ‌ర‌లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం: ఎక్కువ రేటు అమ్మితే చ‌ర్య‌లు

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఎవ‌రైనా నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెంచేస్తే చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. నిత్యావ‌స‌రాలు దొర‌క‌వ‌ని ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, అయితే వాటి కొనుగోలుకు గుంపులుగా బ‌య‌ట‌కు రావొద్ద‌ని, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. లాక్ డౌన్ పై బుధ‌వారం మ‌ధ్యాహ్నం వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప‌లువురు ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.

ప్ర‌జ‌లెవ‌రూ నిత్యావ‌స‌రాల కోసం గుమ్మిగూడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇందుకోసం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో రైతు బ‌జార్ల‌ను ఒకే చోట కాకుండా అనేక ఏరియాల్లో ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు సీఎం. షాపుల దగ్గ‌ర ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా నిర్ణీత దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గుంపులు చేర‌కుండా ఉండేందుకు ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ఉన్న స‌మ‌యాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పెంచాల‌ని సూచించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని సీఎం ఆదేశించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే.. 1902 కాల్‌ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చ‌ని చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్రభుత్వం ప్ర‌క‌టించిన ధ‌ర‌లివే..

1) టొమోటో KG : 10 నుండి 14 రూపాయలు

2) వంకాయలు KG:16 నుండి 20 రూపాయలు

3) బెండకాయలు kg: 25 రూపాయలు

4) పచ్చిమిర్చి kg: 23 రూపాయలు

5) కాకరకాయ kg: 23 రూపాయలు

6) పోట్లకాయ kg: రూ.35

7)కాలిఫ్లవర్ kg: రూ.15

8) క్యాబేజీ kg: రూ.14

9)) కారేట్ kg: రూ. 28

10)దొండకాయలు kg: రూ. 20

11)బంగాళాదుంపలు kg: రూ.20

12)ఉల్లి kg: రూ.28

13) చిక్కుడు kg; రూ.27

14)దోసకాయ kg: రూ.15

15)అరటికాయ జత: రూ. 14

16)బీన్స్ kg: రూ. 28

17)మునగకాయ kg: రూ. 37

18) బీట్రూట్ kg: రూ.18

19)కీరా దోస kg: రూ.20

20)ఫ్రెంచ్ బీన్స్ kg: రూ.24

21)నిమ్మకాయలు డజను: రూ.25

22)అల్లం kg: 90

23) చిక్కుడు kg: 22

24)ముల్లంగి KG: రూ.12

25)వెల్లుల్లి kg:- 92,

26)కొబ్బరి కాయ: రూ.15 – 20

27)అరటిపండు: రూ.3 లేదా 4

Latest Updates