ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ నిషేదం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఆరోగ్యరంగంపై సుజాతరావు కమిటీ సిఫార్సు లను ప్రభుత్వం ఆమోదించింది. వందకుపైగా సిఫార్సులు చేసింది సుజాతరావు కమిటీ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో  ఆరోగ్యశ్రీ అమలు కానుంది. పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకురానున్నారు. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చనున్నారు. ఆపరేషన్‌ చేయించుకున్నవారు కోలుకునేంత వరకూ  నెలకు రూ.5వేల చొప్పున సహాయం అందించనుంది. రూ.వెయ్య దాటితే ఏ వ్యాధికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Latest Updates