వెనక్కి తగ్గిన జగన్.. వెంటనే జీవో రద్దు

ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ పేరు మార్పుపై  వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం. అబ్దుల్ కలాం అవార్డులను వైఎస్సార్ విద్యా పురస్కార్ గా  పేరు మారుస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. యథాతథంగా అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ పేరుతోనే అవార్డులని ఇస్తున్నట్లు తెలిపింది. అబ్దుల్ కలామ్ పేరు మార్పుపై  ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ కోణంతో అబ్దుల్ కలామ్ పేరు మార్చడం అనైతికమని..ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

Latest Updates