ఏపీలోనూ RTC ఛార్జీల మోత

తెలంగాణ ప్రభుత్వం లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచినట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్నీ నాని తెలిపారు. సంస్థలో ఇప్పటికే 6735 కోట్ల రూపాయల మేర నష్టాలు పేరుకుపోయాయని, దానికి తోడు ప్రతినెలా 100 కోట్ల చొప్పున ఏటా 12 వందల కోట్ల రూపాయల అప్పు పెరుగుతుందని అన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి   భారంగా మారడంతో ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. పెంచకపోతే ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ఛార్జీల పెంపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు.

AP government has also increased RTC bus fares

Latest Updates