ఏపీకి వెళ్లాలంటే స్పందన వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రకారం ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులిస్తూ ట్రాన్స్ పోర్ట్ అండ్ ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ‌బాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌నుంచి ఏపీకి వ‌చ్చే వారు spandana.ap.gov.in వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ద‌ర‌ఖాస్తు అనంత‌రం వినియోగ‌దారుల‌కు ఆటోమాటిక్ గా ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్ కి వస్తుందన్నారు. ఈ పాస్ ను చెక్ పోస్టుల‌లో నమోదు చేయించుకుని రాష్ట్రంలోకి రావొచ్చ‌న్నారు. రేపటి నుంచి ఈ విధానం అమలవుతుంద‌న్నారు. ఈ నమోదు వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమేన‌న్న కృష్ణ బాబు..రాష్ట్రంలోకి ఎవ‌రైతే వ‌స్తారో వారికి డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రీట్మెంట్ ఇస్తామ‌ని చెప్పారు.

Latest Updates