తెలంగాణ ఇండెంట్‌పై ఏపీ అభ్యంతరం

అప్పటి నీళ్లు ఇప్పుడెట్ల వాడుకుంటరు?

ఇప్పుడు తీసుకుంటే ఇయర్కిందే లెక్కేయాలి

హైదరాబాద్, వెలుగు: గతేడాది తీసుకోలేకపోయిన నీటిని ఇప్పుడు వాడుకుంటామని తెలంగాణ పంపిన ఇండెంట్ పై ఏపీ అబ్జెక్షన్ చెప్పింది. మే 31తోనే వాటర్ 2019–20 ఇయర్ ముగిసిందని, అప్పటి వరకు వాడుకోని నీటిని ఈ వాటర్ ఇయర్ కు క్యారీ ఫార్వర్డ్ చేయాలనడం సరికాదంది. ఈ మేరకు కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ హరికేశ్ మీనాకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి బుధవారం లెటర్ రాశారు. ‘తెలంగాణ ఇండెంట్ లో కోరినట్టు 36.10 టీఎంసీల నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తీసుకోవడానికి మా రాష్ట్రానికి అభ్యం తరం లేదు. అయితే ఇప్పుడు తీసుకునే నీటిని 2020– 21 వాటర్ ఇయర్ లోనే అకౌంట్ చేయాలి’ అన్నారు. ‘ఆగస్టు ఒకటో తేదీ నాటికి శ్రీశైలంలో మినిమం డ్రా లెవల్ కు ఎగువన 31.35 టీఎంసీలు, నాగార్జునసాగర్ లో ఎండీడీఎల్ కు ఎగువన 74.81 టీఎంసీల నీళ్లు ఉన్నాయి . 66 : 34 ని ష్పత్తిలో తెలంగాణకు 36.10 టీఎంసీలు, మా రాష్ట్రాని కి 70.07 టీఎంసీల నీళ్లు దక్కుతాయి ’ అని చెప్పారు. తెలంగాణ తీసుకునే నీటిని ప్రస్తు త వాటర్ ఇయర్లోనే కౌంట్ చేస్తామని ఆ రాష్ట్రానికి కేఆర్ఎంబీ క్లారిటీ ఇవ్వాలన్నారు.

సాగర్ కు నీటి విడుదల ఆపండి

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ నుంచి నాగార్జునసాగర్ కు నీటి విడుదల ఆపాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మూడోసారి కంప్లైంట్ చేసింది. నాగార్జునసాగర్ లో ప్రస్తు త అవసరాలకు నీళ్లున్నా తెలంగాణ నీటిని విడుదల చేస్తూనే ఉందంది. తెలంగాణ తీరుతో శ్రీశైలంలో 854 లెవల్ మెయింటెయిన్‌ చేయడం సాధ్యం కావడం లేదని.. ఫలితంగా రా యలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు , చెన్నై సిటీలకు తాగునీరు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. శ్రీశైలం డ్యాం ప్రొటోకాల్ కు విరుద్ధంగా నీటిని తెలంగాణ విడుదల చేస్తోందని, దాన్ని వెంటనే ఆపాలని కోరింది.

Latest Updates