కడప స్టీల్ ఫ్లాంట్ కు రూ.50 కోట్లు విడుదల

కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కడప స్టీల్ ఫ్లాంట్ కు రూ.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రాంటును ఉక్కు కర్మాగారంలో భాగస్వామి ఎంపిక, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం వినియోగించాలని నిర్దేశించింది.  ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్టీల్ ఫ్లాంట్ ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించగా.. ఇప్పటికే రూ.72.36 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ప్లాంట్ నిర్మాణం శరవేగంగా కొనసాగించే దిశలో అడుగులు వేస్తోంది ప్రభుత్వం.

Latest Updates