మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాక్

మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తేవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ లేకుండా రాష్ట్రానికి మద్యం తెచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మూడు లిక్కర్ సీసాలను కూడా ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చుకునేందుకు అనుమతి లేదన్న ప్రభుత్వం..ఇతర దేశాలనుంచి లిక్కర్ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Latest Updates