హైద‌రాబాద్‌కు స్పీడ్ బోటులు పంప‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

హైదరాబాదులో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తక్షణం స్పందించారు. వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుండి మూడు, పర్యాటక శాఖ ద్వారా ఐదు మొత్తం 8 స్పీడు బోటులను వెంటనే హైదరాబాదు పంపిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. అంతేగాక ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన ఈతగాళ్లను (డైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను పంపుతున్నట్లు తెలియజేశారు.

Latest Updates