పీఎం కేర్స్, సీఎం రిలీఫ్ ఫండ్స్ కు ఏపీ గవర్నర్ హరిచందన్ విరాళాలు

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ విరాళాలు ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్ కు ఒక నెల వేతనాన్ని, సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలను ఆయన ఇవ్వనున్నట్టు గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలంతా కృషి చేయాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటం ఒక్కటే మార్గమన్నారు. అంతేకాదు సామాజిక దూరం పాటించి అందరూ సురక్షితంగా ఉండాలని… రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సూచించారు.

 

Latest Updates