చంద్రబాబుకు మరో షాకిచ్చిన జగన్ సర్కార్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న కానుకపై విచారణకు ఆదేశించింది. నిధుల విడుదల, సరుకుల నాణ్యతతో పాటు, పథకంలో అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దాంతో ఏపీ సీఎం జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి ఉపయోగించిన సంచులపైనా విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. విజిలెన్స్ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం.

చంద్రబాబు ప్రభుత్వం గతంలో పండుగల సందర్భంగా పేదవారికి సరుకులు ఉచితంగా అందించింది. ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఈ పథకాన్ని పర్వవేక్షించారు. దాంతో విజిలెన్స్ అధికారులు వారిపై కూడా విచారణ చేపట్టనున్నారు.

For More News..

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

వీడియో: కారు రేసులో ఘోర ప్రమాదం.. బయటపడ్డ డ్రైవర్లు

జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యువతులు

Latest Updates