రంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులందరితో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుంది. మే 6 నుంచి జూన్ 5వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు తమ మత పరమైన ఆచారాలు నిర్వర్తించడానికి  సాయంత్రం ఒక గంట ముందు ఆఫీసు, స్కూల్  నుండి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.

Latest Updates