వారంలో పెండ్లి.. అంతలోనే దారుణం.. బ్యాంక్ ఎంప్లాయి హత్య

గజ్వేల్ రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీజీవీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న దివ్యా రెడ్డి (25) తన రూమ్ లో హత్యకు గురయ్యారు. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆమె.. రూమ్ లో రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించారు. దివ్య మంగళవారం విధులు ముగించుకొని సాయంత్రం రూమ్ కు చేరుకున్నారు. ఒంటరిగా ఉన్న దివ్యా రెడ్డిని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. మృతురాలు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందినవారు. దివ్యా రెడ్డికి ఈ నెల26న వివాహం జరగాల్సి ఉంది. తల్లిదండ్రులు ఆమె పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లారు. ఇదే సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం పలు ఆధారాలను సేకరించింది. దివ్యా రెడ్డి హత్య వెనక గల కారణాలు తెలియాల్సి ఉంది. దివ్యారెడ్డి కుటుంబం ఫస్ట్ ఫ్లోర్ లో రెంట్ కు ఉంటుండగా, అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఫ్యామిలీ, పైన పెంట్ హౌజ్ లో
కొందరు బ్యాచిలర్స్ రెంట్ కు ఉంటున్నారని తెలిసింది.

Latest Updates