ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై దుమారం.. హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా

ఎల్లుండి లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో  ఫోన్ ట్యాపింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఈ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార… ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరిన  నేపధ్యంలో.. .  ఏపీ  హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.

ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశించింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. ఈ విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే ఎల్లుండిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది.

 

Latest Updates