ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్.. డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ కి

డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. డాక్టర్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

డాక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి.. గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు విశాఖ సెషన్స్ జడ్జి. శుక్ర‌వారం ఈ కేసును విచారించిన హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని కోర్టు చెప్పింది.

Latest Updates