గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ మృతి

అమరావతి: ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటు మృతి చెందారు. బుధవారం కోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె  ఛార్జ్ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడంతో ఉద్యోగుల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

Latest Updates