ఏపీ ప్రభుత్వానికి షాక్: మూడు రాజధానులపై హైకోర్టు స్టే

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. మూడు రాజధానులపై విడుదల చేసిన గెజిట్ ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్ ను ఇవాళ(మంగళవారం) విచారించిన హైకోర్టు… గెజిట్ పై స్టే ఇచ్చింది. అంతేకాదు రాజధాని తరలింపుతో పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టే విధించింది. 10 రోజుల పాటు ఎప్పటి లానే పరిస్థితులు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 14వ తేదీ వరకు స్టే కొనసాగుతుందని పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు లాయర్లు కోరారు.

Latest Updates