ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

పంచాయతీలకు పార్టీ రంగులపై ప్రభుత్వానికి షాక్

జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు

కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలన్నింటికి వైసీపీ జెండా మాదిరి రంగులు వేశారు. ఆ రంగులను తొలగించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో జీవో నెంబర్ 623ను జారీ చేసింది. ఆ జీవోపై ఏపీకి చెందిన న్యాయవాది సోమయాజి హైకోర్టులో పిల్ వేశారు. పంచాయతీ కార్యాలయాలకు రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేవారు. పాత జీవోలో ఉన్న అంశాలే ఈ జీవోలో కూడా ఉన్నాయని ఆయన పిల్ లో పేర్కొన్నారు. కొత్త జీవోలో పార్టీకి చెందిన రంగులన్నీ అలాగే ఉండేలా ఉందని ఆయన అన్నారు. ఆ జీవోను ఈ రోజు హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్గు ఉత్తర్వులకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

For More News..

మద్యం ధరలు మరో 50 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం

మారటోరియం మరో మూడు నెలలు పెంపు!

ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ బ్యాన్ చేసిన ఆపిల్, గూగుల్

Latest Updates