హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట..ఎన్నికల కమిషన్ కు ఎదురు దెబ్బ

పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ప్రజాఆరోగ్యం దృష్ట్యా షెడ్యూల్ సస్పెండ్ చేసినట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డురాకూడదని తెలిపింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ పిటిషన్ ను విచారించింది హైకోర్టు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ ఒకే సమయంలో వ్యాక్సినేషన్, ఎన్నికల ప్రక్రియ కష్టమని తెలిపారు. దీంతో హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసింది.

కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. నిందితుల మధ్య 143 ఫోన్ కాల్స్

Latest Updates