చంద్రబాబు భద్రతపై హైకోర్టు ఆదేశాలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 97 మందితో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అలాగే చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనంలో జామర్ ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్జీ, ఐఎస్డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని తెలిపింది. చంద్రబాబుకు  ఒక సీఎస్ వోను కూడా ప్రభుత్వం నియమించవచ్చని సూచించింది.