ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ పరీక్షకు 4,76,710 మంది హాజరు కాగా.. మార్చిలో జరిగిన పరీక్షల్లో 2,86,932 మంది విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షల్లో 53,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఈ ఏడాది  ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ లో 3,39,957 మంది ఉత్తీర్ణత సాధించారు.

సెకండ్ ఇయర్ పరీక్షలకు 4,31,739 మంది విద్యార్థులు హాజరు కాగా.. మార్చిలో జరిగిన పరీక్షల్లో 3,09,721 మంది, సప్లిమెంటరీలో 66,114 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో  సెంకడ్ ఇయర్ లో మొత్తంగా 3,75,835 మంది ఉత్తీర్ణులయ్యారు.

సప్లిమెంటరీ ఫలితాల కోసం bieap.gov.in వెబ్ సైట్ ను చూడాలని అధికారులు తెలిపారు.

Latest Updates