కేంద్ర జలశక్తి మంత్రిని కలసిన ఏపీ మంత్రి, ఎంపీలు

ఢిల్లీ: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలు తదితరులు కలిశారు. పోలవరం బకాయిలతోపాటు  పునరావాసం  ప్యాకేజీ నిధులు  విడుదల చేయాలని కోరారు. తెలంగాణతో నీటి వివాదాల నేపధ్యంలో వీరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పోలవరం ప్రాజెక్టు బకాయి నిధులు త్వరితగతిన  విడుదల చేయాలని కోరామన్నారు. తాము అడిగిన వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. వరదల సమయంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రికి తెలియజేశామన్నారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం  పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని.. అందుకే పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన  సెటిల్ చేయాలని కోరామన్నారు. కేంద్ర మంత్రి స్పందించి నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు  విడుదల చేస్తామన్నారు. కృష్ణా నదిలో ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించాను.. అపెక్స్  కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారని.. ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చుని చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

Latest Updates