చంద్రబాబు మాటమీద నిలబడడు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఎన్నడూ మాటమీద నిలబడే వ్యక్తి కాదన్నారు ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా పేర్కొంటూ జిఎన్ రావు కమిటీ గతంలో ఇచ్చిన రిపోర్ట్ ను చంద్రబాబు నాయుడు పనికి మాలిన నివేదిక అని అన్నారని చెప్పారు. జిఎన్ రావు వేస్ట్ వ్యక్తి అని తనకు వైజాగ్ గురించి ఏం తెలుసని.. అతను ఇచ్చిన రిపోర్ట్ ను తగలపెట్టమని చంద్రబాబు అన్నారని తెలిపారు.

అయితే జిఎన్ రావు తాజాగా.. వైజాగ్ కు ప్రకృతి వైపరిత్యాలు జరుగుతాయని చెప్పడంతో ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు బొత్స.   చంద్రబాబుకు మాటమీద నిలపడటం రాదని అన్నారు. వైజాగ్ లో ల్యాండ్ పుల్లింగ్ అనేది… పేదవాళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికని చెప్పారు. ప్రభుత్వం మీద మాట్లాడటానికి ఏం లేకపోవడంతో రాజధాని అంశాన్ని వివాదం చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు…
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

Latest Updates