మంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి

మంత్రి కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. బుధవారం బీమడోలు సమీపంలోని కనకదుర్గమ్మ ఆయల సమీపంలో.. టూవీలర్ పై వెళ్తున్న ఓ వృద్ధుడిని ఏపీ మంత్రి తానేటి వనిత కాన్వాయ్ లోని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ వృద్ధుడు డివైడర్ కు ఢీకొన్నాడు. అతనికి తీవ్రగాయాలవగా స్థానిక హాస్పిటల్ లో చేర్చారు పోలీసులు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు భీమవరానికి చెందిన వెంకటరామయ్యగా (70) గుర్తించారు పోలీసులు. మంత్రి కారు సైతం డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates