హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గలాట

ap-police quarrels at khairthabad traffic signal

హైదరాబాద్ లో ఏపీ పోలీసులు.. తమ తోటి కానిస్టేబుల్ పై జులుం ప్రదర్శించారు . బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన నగరంలోని  ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగింది. పోలీస్ జీపు నుంచి కిందకు దూకిన మధు అనే కానిస్టేబుల్ ను మరో నలుగురు పోలీసులు తిరిగి జీపు (నెంబర్. AP9P 7167) లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో తనను వదిలేయమంటూ వేడుకున్నాడు ఆ కానిస్టేబుల్.

కాసేపు రోడ్డుపైనే తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను బలవంతంగా విజయవాడకు తరలిస్తున్నారంటూ మధు ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ మధు ఎపిఎస్పీ 11వ బెటాలియన్ కు చెందిన వాడు. రోడ్డుపై జరిగిన ఈ గొడవ మొత్తాన్ని అక్కడున్న స్ధానికులు వీడియో తీసి, జోక్యం చేసుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు.

Latest Updates