ఏపీలో కొత్తగా 10,328 కేసులు

  • 1,96,789కి చేరిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కి చేరినట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,753 మంది కరోనా బారిన పడి చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 82,166 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని, 1,12,870 మంది వ్యాధి నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారని అన్నారు. ఇప్పటి వరకు 22,99,332 శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా.. 24 గంటల్లో 63,686 టెస్టుల చేసినట్లు అధికారులు చెప్పారు. 24 గంటల్లో కరోనా కారణంగా అనంతపూర్‌‌లో 10 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, గుంటూరులో 9 మంది, చిత్తూరులో 8 మంది, కృష్ణలో ఆరుగరు, నెల్లూరులో ఆరుగరు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు చనిపోయారు.

Latest Updates