ఏపీలో 4944 కేసులు నమోదు

  •  58,668కి చేరిన కేసుల సంఖ్య
  • 758 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 4944 కేసులు నమోదయ్యాయని హెల్త్‌ అధికారులు బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. 24 గంటల్లో 62 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు వ్యాధి బారినపడి 758 చనిపోయారు. ఇప్పటి వరకు 13,86,274 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరులో ఒక్కరోజే 577 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 10 మంది, విశాఖపట్నంలో 9, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో 7గురు, అనంతపురంలో 6గురు, పశ్చిమగోదావరిలో 6గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5గురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు చొప్పున కరోనాతో చనిపోయారు. 24 గంటల్లో 37,162 శ్యాంపిల్స్‌ను పరీక్షించారు.

Latest Updates