ఏపీలో కొత్తగా 6,923 కేసులు..45 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 6923  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. వైరస్ తో కొత్తగా 45 మంది  చనిపోయారని తెలిపిన ఆరోగ్యశాఖ.. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 675674కు పెరిగినట్లు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64876 యాక్టివ్‌ కేసులున్నాయని.. ఇప్పటి వరకు 605090 మంది కోలుకున్నారంది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5708కు చేరగా.. గడచిన 24 గంటల్లో 7,796 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 56,00,202 శాంపిల్స్‌ పరీక్షించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.

 

Latest Updates