ఏపీలో కొత్తగా 9,747 కేసులు

  • 1,76,333కి చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 64,147 టెస్టులు చేయగా.. 9747 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 176333కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 1604 మంది చనిపోయారు. మొత్తం 95625 మంది హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కాగా.. 79104 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 24 గంటల్లో గుంటూరులో 12 మంది, కృష్ణలో 9 మంది, కర్నూల్‌లో 8 మంది, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరులో ఏడుగురు, అనంతపూర్‌‌, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 21,75,070 శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేశారు.

Latest Updates