ఏపీలో 24,458 టెస్టులు.. 796 పాజిటివ్‌ కేసులు

  • 12,285కి చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 796 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. 24 గంటల్లో 24,458 టెస్టులు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,285కి చేరింది. కాగా ఈ రోజు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 157కి చేరింది. ఇప్పటి వరకు 5480 మంది డిశ్చార్జ్‌ కాగా.. 6648 మంది హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

Latest Updates