ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,676 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 779146కి చేరింది. ఇందులో 37102 కేసులు యాక్టివ్ గా ఉంటే, 735638 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 24 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6406కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపురంలో 193, చిత్తూరులో 473, తూర్పుగోదావరి జిల్లాలో 567, గుంటూరులో 259, కడపలో 246, కృష్ణాలో 308, కర్నూలులో 91, నెల్లూరులో 240, ప్రకాశంలో 348, శ్రీ కాకుళంలో 125, విశాఖపట్నంలో 204, విజయనగరంలో 91, పశ్చిమ గోదావరిలో 531 కేసులు నమోదయ్యాయి.

Latest Updates