ఏపీలో 793 కేసులు.. 11 మంది మృతి

  • 13,891కి చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 793 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 706 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. ఇతర రాష్ట్రాల్లోని వారు 81 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన కేసులు 13,891కి చేరింది. 24 గంటల్లో 30,216 శ్యాంపిల్స్‌ను పరీక్షించామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 4987 మంది డిశ్చార్జ్‌ కాగా.. 6387 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,72,076 టెస్టులు చేశారు. కరోనా వల్ల కర్నూలులో ఐదుగురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కోరు చనిపోయారు. దీంతో చనిపోయినవారి సంఖ్య 180కి చేరింది.

జిల్లాల వారీగా  కేసులు వివరాలు