ఏపీ ప్రజలకు RTGS హెచ్చరిక

ap-rtgs-issue-another-alert-warning

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం ఉందని వెల్లడించింది. చిన్నారులు, వృద్ధులు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈ నెల 10 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వెల్లడించింది.

నిన్నటితో పోల్చుకుంటే మరో మూడు జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగినట్లు RTGS తెలిపింది. నెల్లూరులో 45 డిగ్రీలు, కృష్ణా జిల్లా తిరువూరులో 44 డిగ్రీలు, విశాఖ జిల్లా అనంతగిరిలో 30 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా గారలో 32 డిగ్రీలు, అనంతపురం గుదిబండలో 32 డిగ్రీలు, కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

Latest Updates