పార్టీ మారితే అనర్హత వేటు తప్పదు: ఏపీ స్పీకర్ హెచ్చరిక

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే పార్టీ మారాలనుకుంటే తప్పనిసరిగా శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలా రాజీనామా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు తప్పదని స్పీకర్ హెచ్చరించారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. దానికే తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాలని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. లేదంటే చర్యలు తప్పవని, సభాపతిగా తన వైఖరి ఇదేనని తెలిపారు.

 

Latest Updates