ఏపీ నీళ్ల లెక్క సరిదిద్దాలె..కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్‌‌ 

కృష్ణా బోర్డు జారీ చేసిన వాటర్ రిలీజ్‌‌ ఆర్డర్‌‌లో ఏపీ నీటి వాడకం లెక్కల్లో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురేకు సోమవారం ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌‌ లెటర్‌‌ రాశారు. డిసెంబర్‌‌ నెలాఖరు వరకు పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ ద్వారా చెన్నై తాగునీటిని మినహాయించి122.31 టీఎంసీలు తీసుకున్నారని, కానీ రిలీజ్‌‌ ఆర్డర్‌‌లో120.83 టీఎంసీలు మాత్రమే చూపించారని తెలిపారు. చెన్నై తాగునీటి కోసం తీసుకున్న 1.48 టీఎంసీలను ప్రత్యేకంగా చూపించారని తెలిపారు. నాగార్జున సాగర్‌‌ కుడి కాలువ నుంచి 94.42 టీఎంసీలు తీసుకోగా వినియోగం 92.92 టీఎంసీలుగా చూపించారని, కృష్ణా డెల్టా సిస్టం ద్వారా102.16 టీఎంసీలు వాడినట్లు చూపించారని, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 30.50 టీఎంసీలను లెక్కల్లో చూపించలేదని వివరించారు. పట్టిసీమ ద్వారా మళ్లించిన 30.50 టీఎంసీలకు బదులుగా 18.02 టీఎంసీలు వినియోగం కింద లెక్కించాలని త్రీమెన్‌‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారని గుర్తు చేశారు. ఈ లెక్కన కేడీఎస్‌‌ వినియోగాన్ని 114.64 టీఎంసీలుగా చూపించాలని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకొని లెక్కలను సవరించి మళ్లీ రిలీజ్‌‌ ఆర్డర్‌‌ ఇవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి 

ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు

లాయ‌ర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వ‌ర‌కు లాక్కెళ్లింది

మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్

పతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO

 

Latest Updates