అబ్దుల్ కలాం బయోపిక్‌ ఫస్ట్ లుక్ విడుదల

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్‌ను జగదీశ్ దానేటి దర్శకత్వంలో, హాలీవుడ్ నిర్మాత జానీ మార్టిన్ నిర్మాతగా.. పింక్ జాగ్వర్స్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అబ్దుల్ కలాం పాత్రను హాస్యనటుడు అలీ పోషిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్‌ను నిర్మిస్తున్నందుకు చిత్రయూనిట్‌ను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అభినందించారు. ‘ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ పోస్టర్‌ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అబ్దుల్ కలాం చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా తీయడం సంతోషించదగ్గ విషయం. అబ్దుల్ కలాం మనసు చాలా మంచిది. భారత దేశానికి శాటిలైట్ సేవలను అందించిన ఘనత ఆయనది. ఆయన బతికున్నంతకాలం చాలా సాధారణమైన వ్యక్తిలాగానే ఉన్నారు. ప్రజల మనసులను గెలుచుకున్న గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం’ అని ఆయన అన్నారు.

ఈ బయోపిక్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని నటుడు అలీ అన్నారు. అబ్దుల్ కలాంతో కలిసి ఒక ఫొటో దిగాలనుకున్నానని.. కానీ, అది సాధ్యం కాలేదని అలీ తెలిపారు. ఈ చిత్రాన్ని 2020 సంవత్సరం ఆఖరు వరకు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Latest Updates