బీమా కంపెనీలో వాటా విక్రయం రూ.1,200 కోట్లకు డీల్‌

  • అపోలో ప్రమోటర్ల నిర్ణయం
  • అప్పులు తగ్గించుకునేందుకే

హైదరాబాద్‌ , వెలుగు: మ్యూనిచ్‌ రి ఏజీతో కలిసి నెలకొల్పిన ఇన్సూరెన్స్‌‌ జాయింట్‌ వెంచర్‌ లో తమ వాటా అమ్మేయాలని అపోలో హాస్పిటల్స్‌‌ ప్రమోటర్లు యోచిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్‌‌ ఎంటర్‌ ప్రైజస్‌ లిమిటెడ్‌ అప్పులు తగ్గించడం కోసమే ఇన్సూరెన్స్‌‌ వెంచర్‌ లో తమ వాటాను ప్రమోటర్లు అమ్మాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీలో ప్రతాప్‌ సి రెడ్డి కుటుం బానికి 41 శాతం వాటా ఉంది. రాబోయే ఆరు నెలల్లో ఈ వాటాను రూ.1200 కోట్లకు విక్రయించేందుకు ‌ప్రయత్నిస్తున్నట్ లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అపోలో హాస్పిటల్‌‌ ఎంటర్‌ ప్రైజస్‌ ఈక్విటీని తాకట్టు పెట్టి తీసుకు న్న రు ణాలను తగ్గించుకునేందుకు ఈ నిధులు వెచ ్చించాలని ప్రమోటర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రమోటర్ల షేర్లు తాకట్టు పెట్టిన కంపెనీలంటే మార్కెట్లో ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. సుభాష్‌ చంద్ర, అనిల్‌‌ అంబానీల ఉదంతాలతో ఈ భయం వారిలో మరింత పెరిగింది. మార్ జిన్స్‌‌ ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో ఈ రెం డు కంపెనీల షేర్లు మార్ కెట్లో భారీగా పడిపోయాయి. అపోలో హాస్పిటల్స్‌‌కు రూ.3,430 కోట్ల అప్పులున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి నిధుల కోసం ప్రమోటర్లు తమ షేర్లను తాకట్టు పెట్టి నిధులు సేకరిస్తున్నారు. ఇటీవల కూడా అలా నిధులు సేకరించడంతో, సో మవారం నాడు అపోలో హాస్పిటల్ షేర్లు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి.
అయితే, ఈ వార్తలు పూర్తిగా నిజం కాదని, విదేశీ భాగస్వామి వాటా చే తులు మా ర్చేందుకు చర్చలు జరుగుతున్నాయని అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభన కామినేని చెప్పారు . రు ణ భారం తాత్కాలికమేనని పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్స్‌‌లో తమకున్న 34% వాటాలో మూ డొంతులపైనే ప్రమోటర్లు తనఖా పెట్టినట్లు తెలుస్తోంది. రెం డు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో సహా మొత్తం నా లుగు సంస్థలు ఈ ఇన్సూరెన్స్‌‌ వెంచర్‌ లో వాటా పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇంతకు మ ించిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ జాయింట్‌ వెంచర్‌ లో తన వాటాను కూడా అమ్మేయాలని మ్యూనిచ్‌ రి భావిస్తున్నట్ లు ఇప్పటికే  వార్తలు వచ్చాయి . హెచ్‌ డీఎఫ్‌ సీ ఎర్గో జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్‌ భయంతోనే…
కోలేటరల్‌‌ విలువ తగ్గిపోవడంతో అనిల్ అంబానీ కంపెనీల షేర్లను అప్పులిచ్చిన వాళ్లు ఇటీవల మార్కెట్లో అమ్మేశారు. దాంతో ఆ కంపెనీల షేర్ల ధరలు ఒక్కసా రిగా కు ప్పకూలి, ఆ గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 12,600 కోట్లు పడిపోయింది. అలాగే, మీడియా టైకూన్‌‌ సు భాష్‌ చంద్రకు చెందిన ఎస్సెల్‌‌ గ్రూప్‌ కూడా ఇబ్బందులు ఎదుర్కొం ది. సెప్టెంబర్‌ 30 దాకా గడువు కావాలని రు ణదాతలను ఒప్పించుకుంది ఎస్సెల్‌‌ గ్రూప్‌ . అప్పటిదా కా డి ఫాల్టర్‌ గా పరిగణించమని, తనఖా షేర్లను అమ్మమని ఎస్సెల్‌‌గ్రూప్‌ కు రుణదాతలు హామీ ఇచ్చారు . ఈ నే పథ్యంలో ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్‌‌ వెంచర్‌ లో వాటాల అమ్మకాలకు అపోలో గ్రూప్‌ ఆలోచిస్తోందని చెప్పొచ్చు. అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ ప్రీమియం ఆదాయం మార్చి 2018 తో ముగి సిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి పైగా వృద్ధి చెం ది రూ.1720 కోట్లకు చేర ింది. ఈ ఇన్సూరెన్స్‌‌ వెంచర్‌ లో అపోలో
హాస్పిటల్స్‌‌కూ 10 శాతం వాటా ఉంది.

Latest Updates