సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు వార్నింగ్‌

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. కృష్ణ జింకల కేసు విచారణకు హాజరు కాకపోతే బెయిల్‌ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. అయితే ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. కాగా సల్మాన్‌ ఖాన్‌ ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆయన తరపు న్యాయవాదులకు కోర్టు సూచింది. అయితే విచారణకు సల్మాన్ రాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వారం కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

Latest Updates