యాప్స్‌ తయారీ కంపెనీల టార్గెట్ యాపిల్‌, గూగుల్

యాపిల్, గూగుల్ లకు వ్యతిరేకంగా టెక్ కంపెనీలనుంచి కంప్లయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. యాప్ స్టోర్ లపై ఈ కంపెనీలు అనుసరిస్తోన్న విధానాలపై యాప్ ఓనర్లు మండిపడుతున్నారు. రూల్స్ పాటించడం లేదంటూ యాప్లను తొలగిస్తూ యాపిల్, గూగుల్ లు తమను పైకి రానీయడం లేదని యాప్ తయారీ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే పేటీఎం–గూగుల్ కు మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై తాము గూగుల్ తో న్యాయపరమైన పోరాటానికి సైతం సిద్ధమేనని పేటీఎం ప్రకటించింది.మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటి ఫై కూడా యాపిల్ తన యాప్ స్టోర్ పై విధించిన రూల్స్ ను తప్పుబడుతోంది. అలాగే ఎపిక్ గేమ్స్ కూడా యాపిల్, గూగుల్ లు యాంటీ ట్రస్ట్ రూల్స్ ను అతిక్రమించాయని ఆరోపించింది. ఈ విషయంపై గూగుల్, యాపిల్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు యాప్ ఎకానమీని కాపాడేందుకు చిన్న కంపెనీలన్నీ ఏకమయ్యాయి. యాప్ఫెయిర్ నెస్ కోసం ఒక కూటమిగా ఏర్పడ్డాయి. యాప్ స్టోర్లలో మార్పు లు తీసుకొచ్చేందుకు ఈనాన్ ప్రాఫిట్ గ్రూప్ కృషి చేయనుంది. యాప్ ఎకానమీని కాపాడనుంది. స్పాటి ఫై, బేస్ క్యాంప్,ఎపిక్, మ్యాచ్ గ్రూప్ వంటి 13 కంపెనీలు ఇనీషియల్ మెంబర్లుగా ఈ గ్రూప్ లో చేరాయి.‘మేమంతా కలిసి నిర్ణయించాం .ఈ పోరాటంలో మేము ఒక్కరం కాదు. ప్రతి ఒక్కరి తరఫున మేము పోరాడతాం ’ అని గ్రూప్ స్పోక్స్ పర్సన్ సారా మాక్స్ వెల్ చెప్పారు. ఇది తమలాంటి వారితరఫున గొంతు వినిపించే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని అన్నారు. గూగుల్ కు వ్యతిరేకంగా వచ్చేవారంలోనే యాంటీ ట్రస్ట్ కేసు కూడా నమోదు కాబోతోంది. ఈ కేసులో ఇంటర్నెట్ సెర్చ్ లోకంపెనీ డామినేషన్ పై ఫోకస్ చేయనున్నారు. యాపిల్, దాని యాప్ స్టోర్ నిర్వహణా విధానాలపై యూరప్ లో రెగ్యులేటర్స్ యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టారు. గూగుల్, ఫేస్ బుక్ , యాపిల్,అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లను కాంగ్రెస్ సైతం ఇప్పటికే ప్రశ్నించింది. ఇంటర్నెట్ కామర్స్ లోఅమెజాన్ తన డామినెన్స్ ను దుర్వినియోగం చేస్తుందని యూరప్ లోని రెగ్యులేటర్స్ యాంటీ ట్రస్ట్ ఛార్జీలు విధించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పెద్ద కంపెనీలు తమల్ని పైకి రానీయడం లేదని చిన్న కంపెనీలు చాలా ఏళ్లుగా ఆరోపిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లన్నీ వారి కంట్రోల్ లోనే..

ప్రస్తుతం ఏర్పాటైన గ్రూప్ యాప్ స్టోర్ల విషయంలో గూగుల్, యాపిల్ అనుసరిస్తోన్నవిధానాలపై పోరాటం సాగించనుం ది. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్లను తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఈ రెండింటి యాప్ స్టోర్ల ద్వారానే యాప్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. వారి సిస్టమ్స్ లోని యాప్స్ ద్వారా జరిగే పేమెంట్లకు ఈ రెండు కంపెనీలు 30 శాతం ఫీజుల రూపంలో ఛార్జ్ చేస్తున్నాయి. ఈ రెండు పెద్ద కంపెనీల పేమెంట్ రూల్స్ ను కూడా యాప్ తయారీదారులు వ్యతిరేకిస్తున్నారు. యాపిల్, గూగుల్ సొంత యాప్స్ తో, వారి అన్ఫెయిర్ (సమంజసం కాని) విధానాలతో కూడా తాము పోటీపడాల్సి వస్తోందని యాప్ తయారీ కంపెనీలు చెప్పాయి. గూగుల్, యాపిల్ కంపెనీలు ఇలా చేయడం కన్జూమర్లకు, కాంపిటీషన్, ఇన్నోవేషన్ మంచిది కాదని టైల్ జనరల్ కౌన్సిల్, వైస్ ప్రెసిడెంట్ కిర్స్టన్ దారు అన్నారు. ఈ విషయంపై యాపిల్ కానీ, గూగుల్ కానీ ఇంకా స్పందించలేదు.

Latest Updates