యాపిల్‌కు ఇటలీలో భారీ జరిమానా

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సంస్థకు ఎంతో క్రేజ్ ఉంది. ఆ సంస్థ తయారు చేసిన ఫోన్లు కానీ, ఇతర ఏ వస్తువులైనా సరే జనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొత్త ప్రాడక్ట్ మార్కెట్లోకి రాబోతోందనే న్యూస్ వచ్చిందంటే చాలు కొంత మంది వినియోగదారులు వాటి కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి దిగ్గజ సంస్థ యాపిల్ కు కూడా జరిమానా విధించారు. ఆ సంస్థ తప్పుడు విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ 10 మిలియన్ యూరోస్ జరిమానా విధించింది.

మోడళ్ల ఫోన్లపై యాపిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని… వివరాలను ఇవ్వకుండా, వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని యాంటీ ట్రస్ట్ అథారిటీ తెలిపింది. నీళ్లతో ఫోన్ దెబ్బతింటే వారంటీ వర్తించదని చెప్పడాన్ని తప్పుపట్టింది. నీటిలో పడి దెబ్బతిన్న ఫోన్లకు ఎలాంటి సహకారాన్ని అందించలేదని తెలిపింది. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని చెప్పింది.

Latest Updates