ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ బ్యాన్ చేసిన ఆపిల్, గూగుల్

కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడానికి ఉపయోగించే జీపీఎస్ వ్యవస్థను బ్యాన్ చేయనున్నట్లు ప్రముఖ కంపెనీలైన ఆపిల్ మరియు గూగుల్ ప్రకటించాయి. కరోనా పాజిటివ్ కేసులను కనిపెట్టడానికి జీపీఎస్ కు బదులు మరో కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. దాదాపు స్మార్ట్ ఫోన్లన్నీ ఆపిల్ మరియు గూగుల్ యాప్స్ తోనే నడుస్తాయి. అందువల్ల వాటిలో జీపీఎస్ మరియు బ్లూటూత్ చాలా మఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులను ట్రేస్ చేయడం కోసం వాడటం వల్ల స్మార్ట్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత డాటా కూడా లీకయ్యే ప్రమాదముందని కంపెనీలు అంటున్నాయి. అందుకే కరోనా కేసులను ట్రేస్ చేయడం కోసం జీపీఎస్ కు బదులు మరో కొత్త ట్రేసింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీలు తెలిపాయి. అందుకోసం సంయుక్తంగా పనిచేస్తామని కూడా తెలిపాయి. అయితే ఈ కొత్త ట్రేసింగ్ సిస్టమ్‌తో కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే ట్రేస్ చేయగలరని.. అందుకోసం జీపీఎస్ మరియు బ్లూటూత్ అవసరం ఉండదని కంపెనీలు తెలిపాయి. అంతేకాకుండా.. ఒక దేశానికి ఒక ట్రేసింగ్ యాప్ ని మాత్రమే అనుమతించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా కంపెనీలు తెలిపాయి.

Latest Updates