ఐఫోన్ ఎక్స్ చెన్నైలో తయారీ

న్యూఢిల్లీ : కొత్త మోడల్ ఐఫోన్ల తయారీ త్వరలోనే చెన్నైలో ప్రారంభం కానుంది. ఫాక్స్‌‌‌‌కాన్ టెక్నాలజీ గ్రూప్ మరికొన్ని వారాల్లో ఆపిల్ ఇంక్ పేరిట ఇండియాలో ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించనుంది. ఫాక్స్‌‌‌‌కాన్ తమ పూర్తి స్థాయి తయారీని ప్రారంభించేకంటే ముందు ఐఫోన్ ఎక్స్ డివైజ్‌ ల ట్రయల్‌‌‌‌ రన్‌ ను మొదలుపెట్టనుం ది. దేశీయ షిప్‌ మెంట్‌ లో కేవలం 1 శాతం వాటాతో ఇండియాలో చిన్న ప్లేయర్‌ గా ఆపిల్ నిలిచింది. ఎక్కువ ధరలు ఉండడంతో కస్టమర్లు ఆపిల్‌‌‌‌కు దూరంగా ఉంటున్నారు .ఇండియాలో తయారీ ప్రారంభించడం ద్వారా కాలిఫోర్నియాకు చెందిన ఆపిల్ సంస్థకు 20 శాతంగా ఉన్న దిగుమతి సుంకాల భారం తగ్గనుంది. దీంతో పాటు 30 శాతం లోకల్ సోర్సింగ్‌ తో తమ స్వంత స్టోర్లను ఇండియాలో ప్రారంభించుకునే అవకాశంఉంటుంది. ఫలితంగా ఇండియా మార్కెట్‌ కు తగిన ధరలలో ఐఫోన్‌ ను అందించే వీలు కలుగుతుంది.

చైనా నుండి ఆపిల్ ఔట్

కాలిఫోర్నియాలోని కపర్టినో నుండి చూస్తే ఇండియా మార్కెట్ చాలా చిన్నదిగా కన్పిస్తుంది కాబట్టి ఆపిల్ దూరదృష్టితో వ్యవహరించడం లేదని కౌంటర్‌ పాయింట్ రీసర్చ్ డైరెక్టర్ నీల్ షా అభిప్రాయపడ్డారు . ఇండియా మార్కెట్‌ ను సరిగా అంచనా వేయక, అక్కడి అవకాశాన్ని ఆపిల్‌‌‌‌ ఉపయోగించుకోలేదని అన్నారు . 50 కోట్ల స్మార్ట్ ఫోన్లను దాటుతున్నఇండియా మార్కెట్‌ ను ఆపిల్‌‌‌‌ పెద్దగా పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు . చైనాలో ఆపిల్ మార్కెట్ షేర్ పడిపోతుండడం, యూఎస్–చైనా వాణిజ్యయుద్ధం మరింత ముదురుతుండడంతో తయారీని ఇండియాకు బదలాయించాలని ఆపిల్‌‌‌‌ భావిస్తోందని అన్నారు . తయారీ ఒకే దగ్గర కాకుండా వివిధ చోట్ల ఏర్పరచాలని ఆపిల్‌‌‌‌ నిర్ణయించుకున్నట్లు షా వెల్లడించారు.

సెప్టెం బర్‌‌‌‌‌‌‌‌ నాటికి సిద్ధం

గతేడాది ఇండియాలో 14 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ ఫోన్లను కొనుగోలు చేయగా, వీటిలో ఆపిల్ ఫోన్లు కేవలం 17 లక్షలే. తక్కువ ధరలకే లభ్యమయ్యే చైనా ఫోన్లకే వినియోగదారులు పట్టం కట్టారు . షియోమికి చెందిన రెడ్‌ మీ నోట్ 7 ధర కంటే ఆపిల్‌‌‌‌కు చెందిన ఐఫోన్ ఎక్స్ఎస్ ధర పదింతలు ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మొదటి రెం డు నెలల్లో ఆపిల్ 1,50,000 ఫోన్లను ఇండియాకు ఎగుమతి చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో ఇండియాకు ఆపిల్‌‌‌‌ దిగుమతులు దాదాపు 50 శాతం తగ్గుతాయని కౌంటర్‌ పాయింట్ అభిప్రాయపడింది. ఈ ఏడాది సెప్టెం బర్‌ నుంచి చెన్నైలో తయారయ్యే ఐఫోన్లను ఇండియా మార్కెట్లో అమ్మడంతోపాటు, ఎగుమతి కూడా చేయనున్నారు . ఆపిల్‌‌‌‌ తన కొత్త ఉత్పత్తుల ను ప్రతీ ఏటా సెప్టెం బర్‌ నెలలో ప్రకటిస్తూ వస్తోంది. దీంతో వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం అలవాటుగా మారింది.

ఆపిల్ కోసం రూ.2 వేల కోట్లు

ఇండియాలో ఆపిల్‌‌‌‌ తయారీ కేంద్ర ఏర్పాటు కు రూ.2 వేల కోట్లను తైవాన్ కంపెనీ ఫాక్స్‌‌‌‌కాన్‌ వెచ్చిస్తోంది. అతిపెద్ద ఐఫోన్ తయారీ సంస్థ కూడా. ఫాక్స్‌‌‌‌కాన్‌ కు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో రెండు అసెంబ్లీ యూనిట్లున్నా యి. వీటిలో షియోమీ, నోకియాలకు ఫోన్లను తయారు చేస్తోంది. ఇండియాలో ఉత్పత్తి ని మరింత పెంచడం ద్వారా చైనాలో ఆపిల్ తయారీని తగ్గిం చడానికి దోహదపడుతుంది. బెంగుళూరులో విస్ట్రన్ కార్స్​ ప్లంటులో ఇప్పటికే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 7 వంటి మోడళ్లను ఆపిల్‌‌‌‌ కోసం తయారు చేస్తున్నా మని కంపెనీ అధికారులు తెలిపారు.

Latest Updates