నవంబర్​ నుంచి యాపిల్​ ప్లస్​

ఆన్​లైన్​ వీడియో స్ట్రీమింగ్​సర్వీస్​లోకి యాపిల్​ కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘యాపిల్​ టీవీ ప్లస్’ పేరుతో రానున్న ఈ సర్వీస్ లు​ వచ్చే నవంబర్​నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా కొన్ని సెలెక్టెడ్​ షోలను మాత్రమే అందుబాటులో ఉంచనున్న యాపిల్​ ఆ తర్వాత భారీస్థాయిలో సినిమాలు, వెబ్​సిరీస్​లపై దృష్టి పెట్టనుంది. యాపిల్​ ఓటీటీ (ఓవర్​ ది టాప్) సర్వీస్​ మొదలైతే ‘నెట్​ఫ్లిక్స్, అమెజాన్​ ప్రైమ్​ వీడియో’లకు గట్టి పోటీ ఉండబోతుంది.

మరికొద్ది రోజుల్లో ‘వాల్ట్​ డిస్నీ, ఎటీ అండ్​ టీ, ఎన్​బీసీ యూనివర్సల్’ వంటి సంస్థలు కూడా ఆన్​లైన్​ వీడియో స్ట్రీమింగ్​ సర్వీసెస్​ను అందుబాటులోకి తీసుకొస్తాయి. భవిష్యత్తులో కేబుల్​ టీవీకన్నా ఆన్​లైన్​లోనే ఎంటర్​టైన్​మెంట్​ చూసే అవకాశం ఉండటంతో పెద్ద కంపెనీలు దీనిపై దృష్టిపెడుతున్నాయి.

Latest Updates