భారత్ లో ఆపిల్ రికార్డ్ ..అమ్ముడైన 8లక్షల ఐఫోన్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ సంస్థ కరోనా క్రైసిస్ లో సైతం భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. రిఫ్రెష్డ్ ఇండియా స్ట్రాటజీ మరియు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో మనదేశంలో జూలై – సెప్టెంబర్ (మూడో) త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు  జరిపింది.

యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో ఆన్ లైన్ స్టోర్ వల్ల జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ సంస్థ కు చెందిన ఐఫోన్ అమ్మకాల్లో హిస్టరీ క్రియేట్ చేసినట్లు తెలిపారు.

మూడో త్రైమాసికంలో అమెరికా, యూరప్ తో పాటు ఆసియా పసిఫిక్ దేశాలతో పాటు ఇండియాలో కష్టమర్లు భారీ ఎత్తున ఐఫోన్ ను కొనుగోలు చేశారు. త్రైమాసికంలో ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ లేకపోవడం, భారత్ లో  చైనా స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఐఫోన్ – 11 సిరీస్ అమ్మకాలు జరిగాయి. మరి భారత్ లో ఐఫోన్లు ఎంతమేర  అమ్మకాలు జరిగాయనే విషయాన్ని టీమ్ కుక్ స్పష్టం చేయలేదు.

మార్కెట్ సర్వే కెనాలిస్ ప్రకారం భారత్ లో ఆపిల్ ఐఫోన్ అమ్మకాలు దాదాపు 800,000  ఫోన్‌లను అమ్మినట్లు తెలుస్తోంది.  జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండియాకు ఆపిల్ 8 లక్షలకు  పైగా  ఐఫోన్లను రవాణా చేసింది. తద్వారా రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్లు మార్కెట్ సర్వే సంస్థ కెనాలిస్ డైరెక్టర్ రుషభ్ దోషి అన్నారు.

 

 

Latest Updates