బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌1 ట్రైనింగ్ కు దరఖాస్తులు

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌ 1 నుండి 3 పౌండేషన్‌ కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన BC, SC, ST అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు స్డడీ సర్కిల్‌ డైరక్టర్‌ తెలిపారు. సడ్డీ సర్కిల్‌ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు ఫారం, పూర్తి నోటిఫికేషన్‌ వివరాలు పొందుపరచినట్లు తెలిపారు. దరఖాస్తులను ఆన్‌ లైన్‌ ద్వారా ఈనెల 23వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలని, వారి కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల రూపాయలు మించకూడదని చెప్పారు.

పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు 2 లక్షల రూపాయలకు దాటకూడదనే నిబంధన ఉందన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట్‌లోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు డైరక్టర్‌ తెలిపారు.

Latest Updates