దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్ కుమార్ నియామకం

దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిగా సరోజ్ కుమార్ ను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ,టీఆర్ఎస్ మధ్య నోట్ల కట్లల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. రెండు పార్టీల ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం హీటెక్కించాయి.

బీజేపీ అభ్య‌ర్ధి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో సోదాలు, బండి సంజయ్ అరెస్ట్ తో ఎన్నికల ప్రత్యేక అధికారిని నియమించాలని ఎన్నికల కమిషన్ ని కోరింది బీజేపీ.

ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్‌ను నియమించింది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు.

Latest Updates