TTD పాలక మండలి నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ AP ప్రభుత్వం జీవో ఇచ్చింది. మొత్తం 24 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించినట్టు జీవోలో తెలిపింది. మరో నలుగురు ఎక్స్  అఫిషీయో సభ్యులు బోర్డు మెంబర్లుగా ఉండనున్నారు. పాలక మండలిలో మొత్తం 28 మంది సభ్యులున్నారు.

ఇక తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం దక్కింది. మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, దామోదర్ రావు, వెంకట భాస్కర్ రావుకు , బి. పార్థసారధి రెడ్డి, కె. శివకుమార్, పుత్తా ప్రతాప్ రెడ్డి, మూరంశెట్టి రాములుకు తెలంగాణ కోటాలో చాన్సిచ్చారు. టీటీడీ ఈవో, ఏపీ ఎండోమెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, తుడా చైర్మన్ కు బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండనున్నారు.

 

Latest Updates