ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదు కాగా…మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235కు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,297 మంది డిశ్చార్జ్ అయ్యారు. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,869కు చేరింది.

చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 6, ప్రకాశం 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, పశ్చిమగోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,33,613కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 57,858 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58,78,135 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

AP''s COVID-19 tally breaches 7 lakh mark, 41 more deaths

Latest Updates